Saidabad Raju Incident: సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై అనుమానాలు ఎందుకు : డీజీపీ మహేందర్‌రెడ్డి
Telangana DGP sensational comments : నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు.
DGP Mahender Reddy Gives Clarity On Saidabad Raju Incident: సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (Telangana DGP Mahender Reddy) అన్నారు. నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్‌కౌంటర్ (Encounter) చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని ఆయన తెలిపారు.
ఘటన స్థలంలో ఉన్న గ్యాంగ్‌మన్ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారని డీజీపీ చెప్పారు. రాజు (Raju) రైలు (train) కింద పడటం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారన్నారు. అక్కడున్న రైతులతో సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను చూశారనిన డీజీపీ తెలిపారు. కోణార్క్ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు తగదని డీజీపీ హెచ్చరించారు.
Also Read : India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, 3 శాతం పెరుగుదల
పౌరహక్కుల సంఘం నేతల ఫిర్యాదు
అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు తాజాగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని పౌరహక్కుల సంఘం నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రాజు ఆత్మహత్య కేసుపై (Raju suicide case) సోషల్ మీడియాలోనూ (Social Media) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి చావుకు కారణమైన రాజుకు తగిన శాస్తి జరిగిందని పలువురు అభిప్రాయపడితే.. ఇంకొంత మంది రాజు మృతిపై తమకు తోచిన శాస్త్రీయకోణాలతో సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి అసలు విషయాన్ని స్పష్టం చేశారు.
Also Read : Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో ఈ అమ్మాయి చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook