Redya Naik vs Revanth Reddy: చెప్పు దెబ్బలు తింటాడా ? రేవంత్ రెడ్డికి రెడ్యా నాయక్ సవాల్
Revanth Reddy Allegations on Redya Naik`s Daughter Kavitha Naik: రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రెడ్యా నాయక్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తాను, తన కూతురు కవిత భూముల కోసం పార్టీ మారలేదన్న రెడ్యా నాయక్.. తమ పార్టీ మార్పు వెనుకున్న కారణాన్ని వెల్లడించారు.
Revanth Reddy Allegations on Redya Naik's Daughter Kavitha Naik: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా డోర్నకల్‌లో రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రెడ్యా నాయక్ స్పందించారు. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పచ్చి అబద్దాలుగా అభివర్ణించిన రెడ్యా నాయక్.. తాను, తన కూతురు కవిత ఎలాంటి భూముల కోసం పార్టీ మారలేదు అని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్ళు భవిష్యత్ లేదు కనుకే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాం అని అన్నారు.
మియాపూర్ లో 5 ఎకరాల భూమి కోసమే కూతురు కవిత ఒత్తిడికి తలొగ్గి రెడ్యా నాయక్ పార్టీ మారారు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని రెడ్యా నాయక్ అన్నారు. హైదరాబాద్‌లో తమ కుటుంబానికి సెంటు భూమి లేదు. గతంలో కొంత భూమి కొన్నప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ అమ్మేశాం అని స్పష్టంచేశారు. గతంలో అదే భూమి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్‌లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానికి రెడీగా ఉన్నాను. మరి నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి 10 చెప్పు దెబ్బలు తింటాడా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణించిన రెడ్యానాయక్.. పీసీసీ పదవిని డబ్బుతో కొనుక్కున్నాడు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు డిపాజిట్ కోల్పోయారు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఆరోపించినంత మాత్రాన్నే డోర్నకల్ ప్రజలు రేవంత్ రెడ్డి మాట నమ్మరని.. డర్నకల్ ప్రజలకు నా నీతి నిజాయితీ ఏంటో తెలుసునని రెడ్యా నాయక్ ధీమా వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి : BRS MLA Jeevan Reddy: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై జీవన్ రెడ్డి సెటైర్లు
ఇది కూడా చదవండి : Revanth Reddy Padayatra: బీఆర్ఎస్‌లో చేరిన ఆ 12 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook