Former Home Minister Mahmood Ali:గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులు కూడా తమ కార్యాలయాలలో జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. భారత రాష్ట్రసమితి నేతలు, కేటీఆర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను  ఎగురవేయడానికి తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హజరయ్యారు. కేటీఆర్ జెండాను ఆవిష్కరిస్తుండగా.. మహముద్ అలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.


Read Also: Republic day 2024: రిపబ్లిక్ డే వేడుకలు.. భారతరాష్ట్ర సమితిని ఏకీపారేసిన గవర్నర్ తమిళిసై..


ఈ క్రమంలో అందరు చూస్తుంగానే మాజీ హోంమంత్రి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనను పట్టుకుని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి  ఉంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook