Republic day 2024: రిపబ్లిక్ డే వేడుకలు.. భారతరాష్ట్ర సమితిని ఏకీపారేసిన గవర్నర్ తమిళిసై..

Telangana: గతంలో అధికారంలో ఉన్న భారతరాష్ట్ర సమితి  నియంతృత్వంగా వ్యవహరించిందని గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 10:15 AM IST
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని అన్నారు. ముఖ్యంగా ప్రజావాణి మంగళ, శుక్ర వారంలో కార్యక్రమంలో ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తుందని తెలిపారు.
Republic day 2024: రిపబ్లిక్ డే వేడుకలు.. భారతరాష్ట్ర సమితిని ఏకీపారేసిన గవర్నర్ తమిళిసై..

Governor Tamilisai Soundararajan: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో 75 వ రిపబ్లిక్ వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో గణ తంత్ర వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖలకు చెందిన మంత్రులు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత గవర్నర్ కు పోలీసులు, సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ప్రజలు నియంతృత్వం  పాలనను గద్దెదించారు..

రాజ్యంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన జరుగుతుందని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా గత భారత రాష్ట్రసమితి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని అన్నారు.

Read Also: గణతంత్ర వేడుకలకు ముందు షాకింగ్ నిర్ణయం.. ఫిబ్రవరి 6 వరకు ఆ రాష్ట్రంలో 144 సెక్షన్.. కారణం ఇదే..

ప్రజలు నియంతృత్వ పాలనకు స్వస్తిపలికి ప్రజాపాలనకు పట్టంకట్టారని గవర్నర్ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని అన్నారు. ముఖ్యంగా ప్రజావాణి మంగళ, శుక్ర వారంలో కార్యక్రమంలో ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తుందని తెలిపారు. దీనికి మంత్రులు కూడా హజరై, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని తెలిపారు. 

నిరుద్యోగులు ఆందోళన పడవద్దు..

అదే విధంగా గత ప్రభుత్వం పదేళ్లపాటు పూర్తిగా  అసమర్థంగా వ్యవహరించిదన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా ఛిన్న భిన్నమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రానున్న రోజుల్లో టీఎస్సీఎస్సీ అనేక నోటిఫికేషన్ లను ఇస్తుందని అన్నారు. దీనిపై నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

డాక్టర్ అంబేద్కర్ స్పూర్తితో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధికి ఫలాలు అందేలా పనిచేస్తుందని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో పేర్కొన్నారు. ధైర్యం, ఉదారత, వివేకం, ఉత్సాహం ప్రభుత్వానికి ఉండాల్సిన నాలుగు లక్షణాలు అంటూ గవర్నర్ తమిళిసై '' జైభారత్, జై తెలంగాణ '' .. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News