రేవంత్ నెక్ట్స్ టార్గెట్ సిరిసిల్ల ; కేటీఆర్ ను ఓడించే ప్లాన్ రెడీ
నామినేషన్ల గడవు ముగియడంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరుస పర్యటనలతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..ఆయన తనయుడు కేటీఆర్ కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఎండగడుతుంటే.. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా ప్రచారం అంతా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా సాగుతోంది.
కేసీఆర్ ఓడించే కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఆయన్ను ఓడించేందుకు నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న ఓంటేరు ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డి లను ఏకం చేయడంతో పాటు టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యంగా పోరాడేలా పరిస్థితులు సృష్టించారు. దీనికి తోడు ఇండిపెండెంట్ గా గద్దర్ ను రంగంలోకి దించి తెలంగాణ సెంటిమెంట్ ఓట్లు చీల్చేందుకు పక్కా స్కెచ్ వేశారు.
రేవంత్ ను ఓడించే టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్
దీనికి దీటుగా కేసీఆర్ కూడా తన అల్లుడు హరీష్ రావును రంగంలోకి దింపి ఆయనకు కొండగల్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలు అప్పగించారు. రేవంత్ ను ఓడించే లక్ష్యంగా భాగంగా టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే తాను కొండగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఇలా రేవంత్ ఇలాఖాలో పాగ వేసేందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ వ్యూహాలకు దీటుగా రేవంత్ ప్లాన్
రేవంత్ కూడా అదే స్థాయిలో కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా స్పందిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ను ఓడించే ఆపరేషన్ రెడీ చేసిన రేవంత్ ఇప్పుడు ఆయన తనయుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల పై దృష్టిపెట్టారు. ఈ ప్లాన్ అమలులో భాగంగా రేవంత్ రెడ్డి ఈ నెల 24న సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ ను ఓడించేందుకు కంకణం కట్టుకున్న రేవంత్.. నేరెళ్ల ఘటన, ఇసుక అక్రమ రవాణా, కేసీఆర్ కుటుంబ పాలన తదితర అంశాలపై టీఆర్‌ఎస్ పై దుమ్మెత్తిపోసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సిరిసిల్లలో ప్రచారం
సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానికంగా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో ఒకరినొకరు సహరించుకునే వాతావరణం సృష్టించే ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే కేటీఆర్ పై గట్టి అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. 2009లో కేటీఆర్ పై మహేందర్ రెడ్డి స్పల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం మళ్లీ కేటీఆర్ తో తలపడుతున్నారు. కాగా స్థానిక సమస్యలు, సామాజిక సమీకరణలు, ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్, టీడీపీ ఓటు బ్యాంకు గుంపగత్తగా కాంగ్రెస్ పడేలా చూడటం లాంటి వ్యహాలను రేవంత్ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాలను కేటీఆర్ ఎలా తిప్పికొడరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది