Telangana Power Bills Hike: విద్యుత్‌ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం పేదలపై పెను భారం మోపబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని చూస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుతో ఇప్పటికే పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలి


 


విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయానికి సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం వెళ్లింది. పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాడి కౌశిక్‌ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌ తదితరులు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావును కలిసి తమ అభిప్రాయాలను చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ ఛార్జీలు పెంచరాదని బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం స్పష్టం చేశారు.


Also Read: Yadadri Reels: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి.. యాదాద్రి ఆలయంలో రీల్స్‌, ఫొటోషూట్


 


చైర్మన్‌ను కలిసి వచ్చిన అనంతరం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మోపనున్న విద్యుత్‌ ఛార్జీల భారం విషయమై వివరించారు. 'రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసింది' అని తెలిపారు. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నారని చెప్పారు.


'గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జ్ ఐదు రెట్ల పెంపు, రూ.10 ఉన్న ఛార్జీని రూ.50 చేయాలని చూస్తోంది. ఇళ్లల్లో 300 యూనిట్లు దాటడం సాధారణం' అని కేటీఆర్‌ వివరించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీ చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. పరిశ్రమలన్నింటిని ఒకే కేటగిరి కిందకు తీసుకురావడం ఏమిటో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ సంస్థ ఇప్పటికే చెన్నైకి వెళ్లిందని గుర్తుచేశారు. రైతులు పూర్తిగా  నైరాశ్యంలో ఉన్నారని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.12,500 కోట్లు విద్యుత్ సంస్థలు పెంచాలని చూస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తుచేశారు. 'బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపింది. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాం. విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది' అని కేటీఆర్‌ వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.