HBD Revanth Reddy: పుట్టినరోజు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే! ఎక్కడ సంబరాలు తెలుసా?
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Revanth Reddy Birthday: నవంబర్ 8వ తేదీ రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తన పుట్టిన రోజు రేవంత్ రెడ్డి పూర్తి బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న మూసీ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొననున్నారు. బర్త్ డే రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆయన పుట్టినరోజు సంబరాల కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Ponguleti Bomb: పొంగులేటి మరో బాంబు వార్త.. ఈసారి ఆటమ్ బాంబ్ పేలబోతుంది
మూసీ నదిని అభివృద్ధి చేయాలనే ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో మూసీ నది సరిహద్దు ప్రాంతాల్లో ఇళ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లకు పిలవగా.. ఒక బృందం అధ్యయనం చేస్తోంది. మూసీ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా కూడా రేవంత్ దూకుడుగా వెళ్లడం కొంత కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తోంది.
Also Read: KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్ సంచలన ప్రకటన
షెడ్యూల్ ఇలా
- గురువారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో రేవంత్ రెడ్డి యాదాద్రికి బయలుదేరుతారు
- 10 గంటలకు యాద్రాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సందర్శన.. పూజ కార్యక్రమాలు
- 11.30కు యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి సమీక్ష
- 1.30కి రోడ్డు మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో సంగెం గ్రామానికి బయల్దేరుతారు.
- సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర ప్రారంభిస్తారు.
- పాదయాత్ర: మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర
- ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర. అనంతరం మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగం.
- సాయంత్రం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి