Hydra Ranganath: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్ కు మరో అదిరిపోయే పోస్టు..?..
CM Revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్.. హైడ్రా కాన్సెప్ట్ మీద అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ క్రమంలో ఇటీవల జనసేన నాగబాబు కొణిదేలతోపాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా హైడ్రా పనితీరును కొనియాడారు.
Cm Revanth Reddy bumper offer to hydra ranganath: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా పేరు హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలన ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటినిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం హైడ్రా కాన్సెప్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎక్కడ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మాణాలున్న కూడా కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. చెరువులు, బఫర్ జోన్ లు ఎక్కవ అక్రమ నిర్మాణాలున్న కూడా వెంటనే కూల్చేయాలంటూ కూడా సీఎం రేవంత్ హైడ్రాకు స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చారు. దీంతో సీనియర్ ఐపీఎస్ హైడ్రా కమిషనర్ కూడా తన స్పీడును పెంచారు.
అసలే.. ఐపీఎస్ ఆపైన సీఎం రేవంత్ కూడా సపోర్టుగా ఉండటంతో.. రంగనాథ్ అక్రమ నిర్మాణ దారులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. హైదబాద్ నగర వ్యాప్తంగా కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌కు రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ మరో బంపర్ పోస్ట్ కేటాయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. అయితే.. హైడ్రా రంగనాథ్ కు చెరువులు పరిరక్షణ కమిటీ చైర్మన్ గా నియమించేదుకు సీఎం సానుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
చెరువుల పరిరక్షణకు ప్రయారిటీఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకుగాను రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. ఇదిలా ఉండగా.. హెచ్‌ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. దీని వల్ల.. చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని రేవంత్ సర్కార్ యోచిస్తుందంట.
ఈ మేరకు హైడ్రాతోపాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్ బౌండరీల నిర్ధారణ, నోటిఫికేషన్ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ఆయా జిల్లాల అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో చెరువులున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా...ఇప్పటివరకు 265 చెరువులను నోటిఫై చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి