Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వార్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కూడా కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా కురిసిన వర్షానికి జనాలు ఇంటి నుంచి బైటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. అంతేకాకుండా.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోనికి నీరు కూడా వచ్చి చేరింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇప్పటికే రెండు రోజుల పాటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సైతం అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. వరదల నేపథ్యంలో ఎలాంటి సమస్యలున్న జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. హైదరబాద్ లో ఈరోజు ఉదయం నుంచి వర్షం కాస్తంత తగ్గుముఖం పట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్స్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్ల మీద ఆగిపోయిన నీళ్లను, మ్యాన్ హోల్స్ వద్ద నిలిచిపోయిన చెత్తలను క్లీన్ చేసే పనిలో పడ్డారని చెప్పుకొవచ్చు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ సైతం రంగంలోకి దిగారు. కూకట్ పల్లి జోన్ లోని పలు చెరువులను పరిశీలించారు. ముఖ్యంగా .. Idl చెరువు,సర్దార్ నగర్ వరద ముంపు గురైన ప్రాంతాన్ని పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ముంపుకు గురైన కాలని వాసులకు సురక్షిత త్రాగు నీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.
ముఖ్యంగా దోమల నివారణ ఏ ఎల్ ఓ , ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని కూడా ఆమ్రాపాలీ అధికారులకు ఆదేశించారు. దీనితోపాటు.. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆమ్రాపాలీ కాట కీలక సూచనలు చేశారు.
మరోవైపు వర్షాల నేపథ్యంలో ఇప్పటికి జీహెచ్ఎంసీ అధికారులు సెలవులు తీసుకొవద్దని, ప్రజలకు అన్ని వేళల అందుబాటులో కూడా ఉండాలని కూడా ఆమ్రాపాలి సూచించిన విషయం తెలిసిందే. మరికొన్నిరోజుల్లో వినాయక నవరాత్రుల నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ అధికారులు సైతం ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా పలు చర్యలు చేపట్టారు.