మేడ్చల్ సభలో రేవంత్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా తెలంగాణ గడ్డపై కాలుపెట్టడానికి గల కారణాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఎన్నికల సభ కాదని.. సోనియా ఇక్కడికి ఓట్లు అడగటానికి రాలేదు.. తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించి ఎవరూ ఆత్మబలిదానం చేసుకోవద్దు అని చెప్పి సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. అయితే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పెట్టిన కష్టాలు పెట్టారు ..రైతలను సమస్యలను గాలికి వదిలేశారు.  ఉద్యమకారులను కేసుల నుంచి విముక్తి కల్పించలేదు..అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్ పాలన నుంచి ప్రజలనున విముక్తి కల్పించడానికి.. పేదలను ఆదుకునేందుకే  సోనియా ఇక్కడికి వచ్చారని రేవంత్ రెవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.