Revanth Union Budget: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధుల వరద పారగా.. తెలంగాణకు మరోసారి మొండిచెయ్యే లభించింది. దీంతో తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎందుకు ఎక్కువ వచ్చాయని అడగనని.. కానీ తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో ఆయన స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్‌.. త్వరలోనే ఆమెపై రేవంత్ చర్యలు?


 


పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కక్షపూరితంగా వ్యవహరించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు, తానే స్వయంగా మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని నరేంద్ర మోదీని కోరితే మొండిచెయ్యే లభించిందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం నిషేధించారని ధ్వజమెత్తారు. తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదని తెలిపారు. ఈ బడ్జెట్‌ చూస్తే తెలంగాణపై కేంద్రం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందని చెప్పారు.

Also Read: KCR Assembly Entry: బిగ్‌ బ్రేకింగ్‌.. అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్‌.. తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో


 


కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కేటాయింపులు ఎందుకు ఇచ్చారని తాము అడగమని.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 'మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు. మెట్రోకు నిధులు లేవు. ఐటీఐఈఆర్‌ కారిడార్‌ ప్రస్తావన లేదు' అని వివరించారు. ఈ బడ్జెట్‌ కుర్చీ బచావో బడ్జెట్‌ అని అభివర్ణించారు. ఏపీకి, బిహార్‌లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బీజేపీ 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు ఇస్తే ఏం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కిషన్‌ రెడ్డి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఐఐఎం ఎక్కడా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో తీర్మానం
కేంద్ర బడ్జెట్‌ చూస్తే క్విడ్‌ ప్రొకో తీరుగా ఉందని తెలిపారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుపుతామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపుతామని
తెలిపారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికి హితవు పలికారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి