Anniversary Celebrations: అధికారంలోకి తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుండడంతో నిర్వహించనున్న సంబరాలకు “ప్రజాపాలన- ప్రజా విజయోత్సవం” అని నామకరణం చేశారు. ఉత్సవాలను పకడ్బందీ ప్రణాళికతో పక్కాగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ ఎత్తున సంబరాలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: లగచర్లపై రేవంత్‌ కుట్ర బట్టబయలు.. దాన్ని కవర్‌ చేసుకునేందుకు తంటాలు


ఏడాది పాలన దినోత్సవాలపై హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్క్‌ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం గుర్తుచేశారు.

Also Read: Rashtrapati: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?


ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్‌మెంట్‌కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో వాటిపై వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం. ఈ నెల 19వ తేదీన వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయం.


డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సచివాలయం, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి అధికారులకు చెప్పారు. డిసెంబర్ 9వ తేఈన సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఆ కార్యక్రమానికి మహిళలకు ఆహ్వానం పలకాలని నిర్ణయం. ఈ కార్యక్రమాల నేపథ్యంలో నియోజకవర్గాలవారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి