Revanth Reddy hot comments on Governor and KCR Issue: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలకమైన అంశాలు బయటకు వచ్చాయన్నారు. కేసిఆర్ కుటుంబ సమస్యలు నుండి బయట పడే పనిలో ఉన్నారని గవర్నర్ చెప్పిందన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్ నీ సీఎం చేయడం కుదరదని ఒప్పించే పనిలో కేసీఆర్ ఉన్నారన్నారు. గవర్నర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్య, వైద్య రంగాలను కేసీఆర్  నిర్వీర్యం చేశారని తాము ముందే నుంచి చెబుతున్నదే గవర్నర్ చెప్పారన్నారు రేవంత్ రెడ్డి. ఆసుపత్రుల్లో కుక్కలు, పిల్లులు పెత్తనం చెలాయిస్తున్నాయని గవర్నర్ అన్నారంటే ఆరోగ్య శాఖ ఎంత దుర్భరంగా ఉందో అర్ధం అవుతుందన్నారు. సెక్షన్ 8 పరిధిలో ఉన్న ఏ అంశం పై అయినా గవర్నర్ రివ్యూ చేయొచ్చన్నారు.  గ్రేటర్ పరిధిలో ఏదైనా సమీక్ష చేస్ అధికారం గవర్నర్ కి ఉందన్నారు రేవంత్ రెడ్డి.  గవర్నర్ తన అధికారాలు ఉపయోగించి అన్నిటినీ సరిదిద్దాలన్నారు రేవంత్ రెడ్డి. పరిపాలన దిద్దుబాటు చేయాలని కోరారు. డ్రగ్స్ శాంతి భద్రత సమస్యే అన్న రేవంత్ రెడ్డి.. పూర్థి స్థాయిలో గవర్నర్ సమీక్ష చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 


ప్రోటోకాల్ పాటించని అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటా లో mlcగా కేసిఆర్ ఎవరిని నియమించారని ప్రశ్నించారు.  చేసిన తప్పులు కప్పిపుచ్చుకోడం కోసం గవర్నర్ పై నిందలు ఆపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ పార్టీ అని trs నేతలు ఓటేశారని నిలదీశారు. వెంకయ్య నాయుడు ఏ పార్టీ అని ఓటేసిందో టీఆర్ఎస్ చెప్పాలన్నారు.  రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బండి సంజయ్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు కోపం వస్తుందనే రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కాలేదన్నారు.  కిషన్ రెడ్డి సిటీలో ఉండి ఎందుకు రాజ్ భవన్ వెళ్ళలేదో చెప్పాలన్నారు.


Also Read: Moto G22: మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్​.. ప్రీమియం ఫీచర్లతో


Also Read: Precaution Dose: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన... 18 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోసులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook