Revanth Reddy Master Plan: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే స్థాయి ఫలితాలు సాధించాలనే కసితో ఉంది. ఈసారి అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని భారీ ప్రణాళికతో వ్యూహం రచిస్తోంది. ఈ బాధ్యతను కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన భుజనా వేసుకున్నారు. ఎంపీలను గెలిపించుకునే భారాన్ని కూడా రేవంత్‌ మోస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి సరికొత్త వ్యూహం రచించారు. నామినేషన్‌ వేసిన రోజే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళిక వేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RSP Brother: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న 'తమ్ముడు' ప్రసన్న కుమార్‌


హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డితోపాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి భువనగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు.

Also Read: Govt Collapse: రేవంత్‌ జోలికి మేం వెళ్లం.. కానీ వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు: కిషన్‌ రెడ్డి జోష్యం


 


పార్టీ అసంతృప్తుల వ్యవహారంపై కూడా రేవంత్‌ స్పందించారు. 'టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నాయకులతో కూడా సమన్వయo చేసుకుని ముందుకు సాగాలి' అని సూచించారు. త్వరలోనే అందరికీ గుర్తింపు, న్యాయం జరుగుతుందనే భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని ఆదేశించారు.


రేవంత్‌ ప్రచారం
లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కూడా భుజనా వేసుకున్న రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ప్రచారాన్ని కూడా భారీ స్థాయిలో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్రగా నిర్వహించాలని పార్టీ వర్గాలకు తెలిపారు. నామినేషన్ వేసిన రోజు అదే లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


నామినేషన్‌ ర్యాలీ విజయయాత్ర
ఈ క్రమంలోనే 21వ తేదీన భువనగిరిలో జరిగే నామినేషన్ కార్యక్రమానికి రేవంత్‌ రెడ్డి హాజరు కానున్నారు. అంతేకాకుండా భువనగిరి పార్లమెంట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సభకు పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌కు తిరుగులేదని నిరూపించాలని రేవంత్‌ వ్యూహం. మరి రేవంత్‌ వ్యూహం ఫలించి కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు వస్తాయో చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter