RSP Brother: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న 'తమ్ముడు' ప్రసన్న కుమార్‌

RS Praveen Kumar Brother RS Prasanna Kumar Joining In Congress Party: బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భారీ షాక్‌ తగలనుంది. ప్రవీణ్‌ కుమార్‌ కుటుంబంలో రాజకీయ విబేధాలు ఏర్పడ్డాయి. సొంత తమ్ముడు కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్త కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 10, 2024, 04:32 PM IST
RSP Brother: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న 'తమ్ముడు' ప్రసన్న కుమార్‌

RSP Brother: అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అందరినీ విస్మయానికి గురి చేశారు. అధికారం లేని పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సమయంలో ఆయనకు సొంత కుటుంబం నుంచే భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంత తమ్ముడు ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Govt Collapse: రేవంత్‌ జోలికి మేం వెళ్లం.. కానీ వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు: కిషన్‌ రెడ్డి జోష్యం

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన సోదరుడు ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. రెండు.. మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. ప్రసన్న కుమార్ రాజకీయ ప్రవేశం ప్రవీణ్‌ కుమార్‌కు కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

అయితే సొంత అన్న చేరిన బీఆర్‌ఎస్‌ పార్టీలో కాకుండా ప్రసన్నకుమార్‌ కాంగ్రెస్‌లో చేరనుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఇటీవల ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమర్‌ సమావేశమయ్యారు. ఇది ప్రసన్న కుమార్‌కు నచ్చలేదు. చల్లాతో భేటీ అంశం ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలకు దారి తీసిందని తెలుస్తోంది. సొంత అన్నతో రాజకీయ విబేధాలు రావడంతో ప్రసన్న కుమార్‌ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దపడినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పీసీసీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని సమాచారం. త్వరలోనే రేవంత్‌ రెడ్డితో ప్రసన్న కుమార్‌ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రసన్న కుమార్‌ చేరికను స్వాగతిస్తోంది. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మల్లు రవి గెలుపు కోసం అక్కడ రాజకీయం వ్యూహం నడుపుతోంది. తన సొంత జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న రేవంత్‌ రెడ్డి ఈ మేరకు ప్రసన్న కుమార్‌ను స్వాగతిస్తున్నారు. దీనికితోడు రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో నాగర్‌కర్నూల్‌ సీటు ఎలాగైనా గెలవాలని రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం రచిస్తున్నారు. ఇటు బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడంతోపాటు పార్టీ అభ్యర్థి విజయం కోసం మరిన్ని వ్యూహాలకు రేవంత్‌ పదును పెడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News