Revanth Reddy Speech: గత ప్రభుత్వం పేదలకు విద్య దూరం చేయాలని చూస్తే.. తాము విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, నిరుపేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చామని.. తదనుగుణంగా పని చేస్తున్నట్లు వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR HYDRAA: 'తెలంగాణ‌ను ఏం చేద్దామనుకుంటున్న‌వ్ స్వామి?'


శంషాబాద్‌ మండలం కొందుర్గులో శుక్రవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది. పేదలకు నాణ్యమైన విద్య అందించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించాం. అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించాం' అని వివరించారు.

Also Read: Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!


పదేళ్లలో రూ.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేసిన నాటి సీఎం కేసీఆర్ రూ.7 లక్షల అప్పు మిగిల్చారు. వాటిలో ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయలేదు' అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పేదలకు విద్యను చేరువ చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. '1972 పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్  విధానాన్ని తీసుకొచ్చారు. పీవీ దార్శనిక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారు' అని పేర్కొన్నారు.


'బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం పేదలకు విద్య అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు  చేపట్టలేదు. కానీ  మేం చేస్తుంటే తప్పుపడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం  లేదు. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 


'ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో... ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే విమర్శిస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా?' అంటూ ముఖ్యమంత్రి నిలదీశారు. 'మేం అధికారంలోకి రాగానే 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు  అందించాం. కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగొంచడం మా విధానం. కానీ వాళ్ల కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలనేది కేసీఆర్ విధానం. ఏం? మీ పిల్లలు రాజ్యాలు ఏలాలి కానీ... పేదల పిల్లలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


'బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కాలేదు. వాళ్లకు కాకపోయినా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదు' అని రేవంత్‌ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. 'పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమి, పైసలు ఉన్నయ్ కానీ.. పిల్లలకు బడికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన  ఆయనకు రాలేదు' అని విమర్శించారు. కుల మతాలకతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి