Revanth Reddy on Assembly: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ప్రజలు రకరకాల రూపాల్లో తమ ఆకాంక్షను వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ఈ సందర్బంగా 1956లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి తెలంగాణలో అక్కడి వాళ్లను ఆంధ్ర ప్రాంత నాయకులు అణిచివేసారు. దీంతో అపుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి బీజం పడిందన్నారు. ఈ సందర్బ:గా తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తాము నష్టపోతామని తెలిసినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. అప్పట్లో కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ  ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కావడం యాదృచ్చమే అన్నారు. అందుకే తెలంగాణలో డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉంది.


అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు.తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాము.


ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు అధికారికంగా  తెలంగాణ తల్లి రూపాన్ని అసెంబ్లీ ఆమోదించకపోవడం దురదృష్టకరమన్నారు.


తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి..వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో తెలంగాణ తల్లి ఉండాలా? సాధారణ తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు...తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు..


తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నారన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నామన్నారు. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పు.


మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నామన్నారు. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామన్నారు.ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందాము. దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది.ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాంమన్నారు.


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.