Womens Day Gift: అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి హరీశ్‌ రావు నియోజకవర్గ ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పాటుచేసుకున్నారు. మంత్రిగా ఉన్నా.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా సిద్దిపేట నియోజకవర్గానికి ఏనాడూ లోటు చేయలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడయ్యాక నియోజకవర్గంపై మరింత దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకలు అందించారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: చంచల్‌గూడ జైలు తరలిస్తాం.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం


సిద్దిపేటలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో శుక్రవారం సిద్దిపేట పట్టణం, నంగునూర్‌ మండలాలకు చెందిన 800 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా మహిళలతో హరీశ్ రావు సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సిద్దిపేట ప్రజల ప్రేమ నాకు బలం, శక్తి. సిద్దిపేటను అన్నింటిలో ఆదర్శంగా నిలిపాం' అని తెలిపారు. సిద్దిపేట ఆడపడుచులు ఆర్థికంగా ఎదగాలని, ఎవరి సొంత కాళ్ల మీద వాళ్లు నిలబడాలనేది తన తపన అని పేర్కొన్నారు.

Also Read: Candidates List: కీలకమైన 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఈసారి మళ్లీ ఆయనకు మొండిచెయ్యి 


ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన పథకాలు హరీశ్‌ రావు వివరించారు. 'మహిళల కోసం గత ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్, ఆరోగ్య మహిళా, ఆరోగ్యలక్ష్మి పథకం వంటివి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అందించాం' అని గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు. ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో రాష్ట్రమంతా నీళ్లు లేక బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు కళకళలాడుతుండేవాని తెలిపారు. సిద్దిపేటకు ఎన్నో చేసుకున్నామని 'వైద్య కళాశాల, రైలు' తదితర వంటి అంశాలను గుర్తుచేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి