Revanth Reddy criticises TRS govt: ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని (Telangana Martyrs Memorial) ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల్లో తన అధికారిక నివాసాన్ని నిర్మించుకున్న సీఎం కేసీఆర్ (CM KCR)... ఏడేళ్లు గడిచినా అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని పట్టించుకోవట్లేదన్నారు. గతంలో రూ.60 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.180 కోట్లకు పెంచారని... అయినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగట్లేదని అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట నిర్మాణంలో అమరవీరుల స్తూపాన్ని శనివారం (డిసెంబర్ 11) రేవంత్ రెడ్డి పరిశీలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆర్థిక సాయం, భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పటికీ వారికి అందలేదన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణానికి 2017లో రూ.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... మరో ఏడాదికి గానీ టెండర్లు పిలవలేదన్నారు. పైగా ఏమాత్రం అనుభవం లేని ఆంధ్రా కాంట్రాక్టర్‌కు టెండర్‌ను కట్టబెట్టారని ఆరోపించారు. టీహబ్ నిర్మాణంలో రూ.కోట్లు కొల్లగట్టిన కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చారని... నాలుగేళ్లు గడిచినా స్తూపం నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు.


ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అమరవీరుల స్తూపాన్ని (Telangana Martyrs Memorial) నిర్మిస్తామని కేసీఆర్ గతంలో చెప్పినట్లు రేవంత్ గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ స్తూపం నిర్మాణం పూర్తి చేయకుండా అమరవీరులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే అమరవీరులకు తగిన గుర్తింపు దక్కుతుందనుకుంటే.. కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇటీవలే సచివాలయాన్ని సందర్శించిన కేసీఆర్... దసరా లోపు దాని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. మరి.. అమరవీరుల స్తూపం సంగతేంటని ప్రశ్నించారు. అసలు అమరవీరుల స్తూపం నిర్మాణ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని నిలదీశారు. తెలంగాణలో అందుకు అర్హులు లేరా అని మండిపడ్డారు.


పిడికెడు మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని గతంలో కేసీఆరే  (CM KCR) చెప్పారని... ఇప్పుడు అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని కూడా ఆంధ్రా కాంట్రాక్టర్‌కే ఇచ్చారని అన్నారు. కేసీఆర్ అసలు తెలంగాణ వాడో కాదో డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడాలంటే విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.


Also Read: Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook