Revanth Reddy Speech In Warangal: వరంగల్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమం సమయంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీవీ ఛానెళ్లు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. వీళ్లు ఆ ప్రత్యేక తెలంగాణను దోచుకోవడం వల్లే బడా బాబులు అయ్యారు. ఇలా వీళ్లను, వీళ్ల పాలనను ఇంకెంత కాలం భరిద్దాం ? దీనికి మందు లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించార. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 12వరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి... హనుమకొండలోని అమృత జంక్షన్ వద్ద నిర్వహించిన జనసభలో ప్రసంగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరు. అవకాశం వస్తే వెంటనే కేసీఆర్‌ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనుమాముల మార్కెట్ దళారుల పాలు అయిందని రైతులు తమ గోడు వినిపించారు. బీఆరెస్ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా జనం భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ.. కేవలం అమరుల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే రాలేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 


తెలంగాణ వచ్చాకా కూడా రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డలా మారింది. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారింది. కాళోజీ కళా క్షేత్రం మొండిగోడలతో నిలబడ్డది. ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి ? జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఏమయ్యాయి ? తొమ్మిదేళ్లయినా అమరుల స్థూపం నిర్మాణం పూర్తికాలేదు. కేసీఆర్ ప్రకటించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా ఇప్పటికీ ఏర్పాటు పూర్తికాలేదు. కానీ 9 నెలలో ప్రగతి భవన్ పూర్తయింది. వాస్తు కోసం 9 నెలలో సచివాలయం నిర్మాణం పూర్తయింది. దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ లేదు, కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ హామీలు చాంతాడంత ఉన్నాయి. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిలదీశారు. 


ఇది కూడా చదవండి : Minister Harish Rao Speech: ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్ ఎందుకు చేయడం లేదని మండిపడిన మంత్రి


ఇది కూడా చదవండి : Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్


ఇది కూడా చదవండి : MLA Sayanna Passed Away: బిగ్ బ్రేకింగ్.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook