రవిప్రకాశ్‌ను కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు రేవంత్ రెడ్డి
రవిప్రకాశ్‌ను కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు రేవంత్ రెడ్డి
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పరామర్శించి, ఆయనకు తగ సంఘీభావం ప్రకటించేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఇంకాసేపట్లో చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. గతంలో టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై శనివారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం రవిప్రకాశ్‌ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా... న్యాయమూర్తి ఆయనకు రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకే పోలీసులు రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.