MLA Sanjay Kumar: ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి దుకాణం బంద్‌ అయ్యేట్టు కనిపిస్తోంది. మొన్న సీనియర్‌ నాయకుడు, మాజీ స్పీకర్‌ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్ కూడా పార్టీ మారడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి పూట సంజయ్‌ కుమార్‌కు రేవంత్‌ రెడ్డి కండువా కప్పారు. తాజా పరిణామంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత సంక్షోభంలోకి వెళ్లింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: రేవంత్‌ రెడ్డి ఒక కటింగ్ మాస్టర్‌.. అన్నింటికీ కటింగ్‌లేనా?


 


గతేడాది జరిగిన ఎన్నికల్లో జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిపై సంజయ్‌ కుమార్‌ విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్‌ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంజయ్‌ కుమార్‌ పార్టీ మారడం కలకలం రేపింది. కాగా సంజయ్‌ పార్టీ మార్పుతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య ఐదుకు చేరింది.

Also Read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి


 


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి నివాసంలో ఆదివారం అర్ధరాత్రి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి సమక్షంలో సంజయ్‌ కండువా మార్చుకున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌ రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డితోపాటు సంజయ్‌ కుమార్‌ చేరికతో ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇంకా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్‌ ఉన్నాడు.


గులాబీ దళం గుర్రు
అయితే పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ గుర్రుగా ఉంది. దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉంది. మరింత తీవ్రంగా ఫిరాయింపులపై పోరాటం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter