Telangana: ట్రాలీని ఢీకొట్టిన లారీ...
వలస కూలీలను తమ స్వగ్రామాలకు తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టిన ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
హైదరాబాద్: వలస కూలీలను తమ స్వగ్రామాలకు తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టిన ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఆంధ్రకు చెందిన వలస కూలీలు కరోనా లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో తమ స్వగ్రామమైన అద్దంకికి రెండు ట్రాలీ వాహనాల్లో శనివారం బయల్దేరారు. మార్గమధ్యంలో కేతేపల్లి మండలం ఇనుపాముల సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వలస కూలీల ట్రాలీని హైదరాబాద్ నుంచి విజవాడ వైపు ఐస్‌క్రీం లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
Also Read: Lockdown 5.0: కీలక మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్..
కాగా గాయపడిన వారిని నకిరేకల్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందిస్తూ లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ తెలిపారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..