ATM Withdrawal: బంపర్ ఆఫర్.. రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు.. ఎక్కడంటే..!
Siddipet ATM Withdrawal: ఓ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు రావడంతో జనాలు భారీగా క్యూ కట్టారు. అసలు విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ఏటీఎంను క్లోజ్ చేశారు.
Siddipet ATM Withdrawal: డబ్బు ఎవరికి చేదు చెప్పండి.. ఓ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు వచ్చాయి. ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి అలా పాకిపోయింది. ఇంకేముంది ఆ ఏటీఎం ముందు వందలాది మంది క్యూ కట్టారు. తమకు అవకాశం వస్తే.. అందినకాడికి డ్రా చేసుకుని వెళ్లిపోదామని అనుకున్నారు. ఏటీఎం వద్ద భారీగా గుమిగూడిన జనాలను చూసి బ్యాంక్ అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే ఏటీఎం క్లోజ్ చేసి అక్కడి నుంచి జనాలను పంపించేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..
సిద్దిపేటలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం డబ్బులు డ్రా చేసుకునేందుకు ఓ కస్టమర్ వెళ్లాడు. అయితే అతను రూ.1000 డ్రా చేస్తే 2 వేల రూపాయలు వచ్చాయి. అతనితో పాటు వెనుకల ఉన్న వారు కూడా వచ్చినకాడికి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయం అలా అలా అందరికీ తెలిపోయింది.
దీంతో ఆ ఏటీఎం వద్దకు జనాలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పెద్దగా ఎగబడ్డారు. ఏటీఎం వద్దకు ఒక్కసారిగా భారీగా జనాలు తరలిరావడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుని ఏటీఎంను క్లోజ్ చేశారు. అక్కడ ఉన్నవారందరినీ పంపించేశారు. దీంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు అవకాశం రాని వారు నిరాశగా వెనుదిరిగిపోయారు.
ప్రస్తుత నెట్ యుగంలో అందరూ యూపీఐ ద్వారానే ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ చిటికెలో ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపించేస్తున్నారు. ఏటీఎం వద్ద క్యూ లైన్లు చూసి చాలా కాలమై పోయింది. ఒక్కసారిగా భారీగా జనాలు తరలిరావడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి ఏటీఎంను క్లోజ్ చేశారు.
Also Read: భారత్ చీట్ చేసి గెలిచింది.. పాకిస్తాన్ మాజీలు, అభిమానులకు కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook