Umpire Simon Taufel reacts on India vs Pakistan No Ball and Dead Ball Issue: టీ20 ప్రపంచకప్ 2021 ఓటమికి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్థాన్‌పై భారత జట్టు విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య చేధనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6), హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌కు బాటలు వేసుకోగా.. పాక్ మిగతా అన్ని మ్యాచులు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 16 పరుగులు. స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ బంతిని అందుకోగా.. హార్దిక్ పాండ్యా స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. సిక్సర్ బాదుతాడనుకున్న హార్దిక్.. తొలి బంతికే పెవిలియన్ చేరాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ తీయగా.. మూడో బంతికి విరాట్ కోహ్లీ రెండు పరుగులు చేశాడు. దాంతో భారత్ విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతిని నవాజ్ ఫుల్‌టాస్ వేయగా.. కోహ్లీ భారీ సిక్సర్ బాదేశాడు. ఈ బంతికి ముందుగా అంపైర్ నోబాల్ ఇవ్వలేదు.. కోహ్లీ అడగ్గానే ఓకే అనేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. ఎలా ఇస్తారు అంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. చివరకు అది నోబాల్ అని అతడికి సర్దిచెప్పారు. దాంతో భారత్ 3 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది.
మొహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బంతి వైడ్ పడింది. దాంతో టీమిండియాకు ఫ్రీహిట్ అలానే ఉంది. మరుసటి (నాలుగో) బంతికి విరాట్ కోహ్లీ బౌల్డయినా.. ఫ్రీహిట్ కావడంతో భారత బ్యాటర్లు (కోహ్లీ, డిష్ కార్తీక్) మూడు పరుగులు తీశారు. ఇది డెడ్ బాల్‌గా ప్రకటించాలని బాబర్ ఆజామ్ మరోసారి అంపైర్‌ను ఆశ్రయించాడు. అది కుదరలేదు. చివరకు భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. నవాజ్ వేసిన ఐదో బంతికి కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. ఆరో బంతికి ఆర్ అశ్విన్ స్ట్రైకింగ్‌కు రాగా.. వైడ్ బాల్ పడింది. దాంతో భారత్ విజయానికి ఒక్క పరుగు మాత్రమే చేయాల్సి వచ్చింది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ మ్యాచ్ గెలిచింది.
మ్యాచ్ అనంతరం భారత జట్టు మోసం చేసి గెలిచిందంటూ.. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ బంతి నో బాల్ కాదని, యార్కర్ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొంది. దాంతో Cheating, India Cheat అనే టాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఈ వార్తలపై ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్ సైమన్ టాఫెల్ స్పందించాడు. 'అంపైర్ నిర్ణయం సరైందే. స్టంప్స్‌ను బంతి తాకిన తర్వాత బ్యాటర్లు వికెట్ల మధ్య పరిగెత్తినపుడు బైస్‌గా ఇవ్వొచ్చు. ఫ్రీ హిట్ సమయంలో స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ బౌల్డ్ అవ్వడు. కాబట్టి బాల స్టంప్స్‌ను తాకినందు వల్ల డెడ్ బాల్‌గా ప్రకటించే వీలులేదు. బైస్ నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయం సరైందే' అని చెప్పారు.
Also Read: టీ20 ప్రపంచకప్ 2022లో కరోనా కలకలం.. స్టార్ బౌలర్‌కు పాజిటివ్!
Also Read: Krithy Shetty Saree Photos: చీరకట్టులో కృతి శెట్టి క్యూట్ ఫోటోలు.. కవ్వించి చంపేస్తోందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి