RS Praveen Kumar to join BSP: హైదరాబాద్: రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని బిఎస్పీ అధినేత్రి మాయావతి (BSP chief Mayawati) ధృవీకరించినట్టు తెలుస్తోంది. 26 ఏళ్లపాటు ఐపీఎస్ సర్వీసులో అనేక బాధ్యతలు చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. చివరిగా తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఇటీవలే వాల్యుంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ బిఎస్పీలోకి వస్తే.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. స్వచ్ఛంద పదవీ విరమణ (RS Praveen Kumar VRS) అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో పర్యటిస్తూ తాను ఏర్పాటు చేసిన స్వేరో బృందాలను (Swaero teams) కలుస్తూ వస్తున్నారు. 


Also read : Inugala Peddi Reddy: హుజూరాబాద్‌లో బీజేపీకి మరో షాక్.. పెద్ది రెడ్డి రాజీనామా!


మరింత విస్తృతస్థాయిలో సామాజిక సేవ చేసేందుకే స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటున్నానని ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar).. తన బీఎస్పీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి సామాజిక సేవ కొనసాగించాలని భావిస్తున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls) ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు అనేక చర్చలకు తావిస్తున్నాయి. 


Also read : Etela Rajender: చిన్నోళ్లమా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు: KCR కి ఈటల కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook