Inugala Peddi Reddy: హుజూరాబాద్‌లో బీజేపీకి మరో షాక్.. పెద్ది రెడ్డి రాజీనామా!

Inugala Peddi Reddy resigned to BJP: హుజూరాబాద్: హుజురాబాద్‌లో బీజేపీ నేత ఇనుగాల పెద్ది రెడ్డి రూపంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి... ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2021, 09:03 PM IST
Inugala Peddi Reddy: హుజూరాబాద్‌లో బీజేపీకి మరో షాక్.. పెద్ది రెడ్డి రాజీనామా!

Inugala Peddi Reddy resigned to BJP: హుజూరాబాద్: హుజురాబాద్‌లో బీజేపీ నేత ఇనుగాల పెద్ది రెడ్డి రూపంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి... ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నుంచి ఇన్నేళ్లపాటు ఈటల రాజేందర్‌ను ఎదుర్కున్న నాకు మాట మాత్రమైనా చెప్పకుండానే ఆయన్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని పెద్ది రెడ్డి పార్టీ పట్ల గుర్రుగా ఉంటూ వస్తున్నారు. అలా ఈటల రాజేందర్ చేరికతో పార్టీలో తనకు ప్రాధాన్యత కరువైందనే పార్టీకి గుడ్ బై చెప్పినట్టు  తెలుస్తోంది. 

పెద్దిరెడ్డి గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేశారు. టీడీపీ హయాంలో కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన పెద్ది రెడ్డి ఆ తర్వాత కాలంలో బీజేపీలో (BJP leader Peddi Reddy) చేరారు. 

Also read : Etela Rajender: చిన్నోళ్లమా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు: KCR కి ఈటల కౌంటర్

BJP in Huzurabad - హుజూరాబాద్‌లో బీజేపికి ఇబ్బందికరమైన పరిణామం:
హుజూరాబాద్‌లో బీజేపీ ఇంచార్జ్ గా ఉంటూ వస్తున్న పెద్ది రెడ్డి ఆ పార్టీని వీడటం ఒక రకంగా పార్టీకి ఇబ్బందికరమైన పరిణామమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకాలం పాటు తనను ఆదరించిన జనం చేత ఈటల రాజేందర్‌కి ఓట్లు వేయించాల్సిన సమయంలో పెద్ది రెడ్డి ఇలా పార్టీని వీడటం పార్టీకి ప్రతీకూల అంశమే అవుతుందనేది వారి మాట.

Peddi Reddy political plans - పెద్ది రెడ్డి దారెటు ?
బీజేపీకి గుడ్‌బై చెప్పిన పెద్ది రెడ్డి తర్వాత ఏ పార్టీలో చేరతారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీపై ఆగ్రహంతోనే పార్టీని వీడిన పెద్దిరెడ్డి ఆ కోపంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరతారా (Peddi Reddy to join TRS) అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి పెద్దిరెడ్డి ఏం చెబుతారో అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

Also read : Etela Rajender చిన్నోడు.. ఈటల వచ్చేది లేదు సచ్చేది లేదు.. CM KCR phone call leaked

Motkupalli Narsimhulu - మోత్కుపల్లి నర్సింహులు బాటలోనే..
పెద్దిరెడ్డి కూడా మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) తరహాలోనే పార్టీపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడటం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్టుగా టీఆర్ఎస్ నుంచి ఎవరైనా పెద్దిరెడ్డిని సంప్రదించారా ? టిఆర్ఎస్ నుంచి పెద్దిరెడ్డికి ఏదైనా హామీ లభించిందా ? టీఆర్ఎస్ పార్టీలో చేరే ఉద్దేశంతోనే పెద్దిరెడ్డి బీజేపిని వీడారా ? లేక ఇవన్నీ కాకుండా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి.

Also read : Kaushik Reddy joins TRS: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News