Rec౦rding Dance: వాళ్లంతా ప్రజలు ఎనుకున్న ప్రజా ప్రతినిధులు.. పైగా అధికార పార్టీ నేతలు. గౌరవప్రదమైన పదవుల్లో ఉనన్ లీడర్లు దిగజారి పోయారు. హోదాను మరిచి చిల్లరగా వ్యవహరించారు. విందు పార్టీలో రెచ్చిపోయారు. ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఊగిపోయారు. అసభ్య నృత్యాలు చేశారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. మద్యం మత్తులో  అధికార పార్టీ నేతలు చేసిన గలీజు వ్యవహారానికి సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి. వైరల్ గా మారాయి. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు రచ్చగా మారింది. ప్రజాప్రతినిధుల తీరుపై ఆదిలాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శైలేందర్ వాగ్మారే తన పుట్టినరోజును ఈనెల 18న ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి ఆదిలాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ నేతలు ఎక్కువగా వచ్చారు. అయితే తన పార్టీలో మందు, విందు ఏర్పాటు చేసిన శైలేందర్.. రికార్డింగ్ డ్యాన్స్ కూడా పెట్టించారు. నిజానికి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతి లేదు. తొలిసారి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించడంతో పార్టీకి వచ్చిన నేతలు ఫుల్లుగా జల్సా చేశారు. మద్యం మత్తులో రాజకీయ నేతలు రెచ్చిపోయారు. తమ హోదాను మరిచి తీన్మార్ స్టెప్పులు వేశారు. రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్న మహిళలతో కలిసి అసభ్యకరంగా నృత్యాలు చేశారు.


టీఆర్ఎస్ నేత బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆఫీసర్స్ క్లబ్ లో చిందులు వేయడం, రికార్డింగ్ డ్యాన్సులు వేయడం వివాదంగా మారింది. వేడుకల్లో అసభ్యకర నృత్యాలు, మహిళలతో కలిసి రాజకీయ నాయకులు చిందులు వేయడంపై జనాలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీరియస్ గా స్పందించారు. విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. 


READ ALSO: Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు మరోసారి ప్రజ్ఞానంద షాక్!


READ ALSO: AP CRISIS: ఓవర్ డ్రాఫ్ట్ లో ఏపీ టాప్.. తెలంగాణ సెకండ్! శ్రీలంక పరిస్థితులు రాబోతున్నాయా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook