Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..రైతు బంధు నిధుల జమ ఎప్పుడో తెలుసా..?
Rythu Bandhu: తెలంగాణలోని రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Rythu Bandhu: తెలంగాణలోని రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈనెల 28న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్ సోమేష్ కుమార్ అధికారికంగా తెలిపారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతుంది.
రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతు బంధు సొమ్ముపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతు బంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు..వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. రైతు బంధు, రైతు బీమా ఇతర పథకాలకు సంబంధించిన ఏ సమాచారమైనా కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.
Also read: UPSC Prelims Result-2022: సివిల్స్-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!
Also read:Uddhav Thackeray: దేనికైనా రెడీ..రాజీనామాపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.