Rythu Bandhu will Credit by Today: నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు పథకం డబ్బులు.. అకౌంట్లో చెక్ చేసుకోండి!
Rythu Bandhu Scheme June installment Will be Credited by Today: రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేయాల్సిందిగా స్పష్టంచేస్తూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
Rythu Bandhu Scheme June Month Installment Will Credit by Today: రైతు బంధు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతు బంధు పథకం నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేయాల్సిందిగా స్పష్టంచేస్తూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
రైతు బంధు పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరాకు రూ 5 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఎప్పటి తరహాలోనే తొలి ప్రాధాన్యత కింద ఎకరం భూమి నిరుపేద రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకం డబ్బులు డిపాజిట్ కానున్నాయి. ఆ తరువాత ఎకరం నుంచి రెండు ఎకరాలు, ఆ తరువాత మూడు ఎకరాలు ఉన్న రైతులు.. ఇలా తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న వారి నుంచి మొదలై ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారి ఖాతాల్లో వరుస క్రమంలో డబ్బులు డిపాజిట్ కానున్నాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana EAMCET Counselling First Phase: తెలంగాణ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్
వానాకాలం పంటల సీజన్ కావడంతో ఇప్పటికే కొంతమంది రైతులు అలుకుడు ప్రక్రియ చేపట్టి దున్నకాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవడం ఒకింత తీపి కబురే అయినప్పటికీ.. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, దున్నకాల ఖర్చు రూపంలో ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోవడం తమకు మరింత భారం అవుతోందంటున్నారు సన్నకారు రైతులు.
ఇది కూడా చదవండి: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ఇదిలావుంటే ఇటీవల విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బుల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదని ఇంకొంత మంది రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో తమ డబ్బులు తమకు అందితే.. అందులోంచి పెట్టుబడి ఖర్చులు, అప్పులు పోగా మిగిలిన దాంట్లోనే తమ తదుపరి ఖర్చులు వెళ్లదీయడంతో పాటు మళ్లీ పంట పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురవడం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో రైతులు పొలం బాటపట్టారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం, రానున్న రెండ్రోజులు 8 జిల్లాలకు అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook