Telangana EAMCET Counselling First Phase Important Dates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న అంశం ఏదైనా ఉందా అంటే అది ఎంసెట్ కౌన్సిలింగ్ అనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే వారు కోరుకున్న కోర్సులో, కోరుకున్న కాలేజీలో సీటు లభిస్తుందా లేదా అనేది ఎంసెట్ కౌన్సిలింగ్ లోనే తెలుస్తుంది కనుక ప్రస్తుతం ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టి అంతా ఈ కౌన్సిలింగ్ పైనే ఆధారపడి ఉంది.
తెలంగాణ సర్కారు వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 26 నుంచి.. అంటే రేపటి నుంచే ఎంసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఫీజు చెల్లించి కౌన్సిలింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 28 నుంచి జూలై 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Rythu Bandhu Scheme 2023 June: నేటి నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకం డబ్బులు
వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఎప్పుడెంటే..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయివ అనంతరం జూన్ 28వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పద్ధతిలో కావాల్సిన కాలేజీలను ఎంచుకున్న అనంతరం జూలై 12న సీట్ల కేటాయించడం జరుగుతుంది. కాగా జూలై 12 నుంచి 19వ తేదీ మధ్యలో ఎంసెట్ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ABVP Bandh in Telangana: రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ బంద్.. ఏబీవీపీ పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK