Heavy Rains in Hyderabad: రుతుపవనాల ప్రభావం తెలంగాణలో ప్రారంభమైపోయింది. హైదరాబాద్ జంట నగరాల్ని భారీ వర్షం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దాదాపు గంటసేపట్నింటి ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావం హైదరాబాద్‌పై ముందుగా కన్పిస్తోంది. రెండ్రోజుల్నించి ఏదో సమయంలో భారీ వర్షం పడుతోంది. ఇవాళ కాస్సేపటి క్రింత మరోసారి జంట నగరాల్లో భారీ వర్షం గంటసేపు ఏకధాటిగా కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై నీరు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పీక్ టైమ్ కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, లక్డీకాపూల్, టోలీచౌకి, బేగంపేట, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు లింగంపల్లి, పఠాన్ చెరువు, ఆర్సీపురంలో కూడా భారీ వర్షం కురిసింది.
Also Read: Diabetes Diet: మధుమేహం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే పదార్ధమిదే
మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఈ నెల 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్ నగరంలో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు రేపు, ఎల్లుండ కూడా పడే అవకాశాలున్నాయి. మరో రెండ్రోజుల్లో రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించి..దక్షిణ తెలంగాణలో సైతం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: Kuppam 2024: కుప్పంలో ఏం జరుగుతోంది, వైనాట్ కుప్పం సాధ్యమయ్యేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook