Rythu Bharosa: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు డేట్స్ ఫిక్స్
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Rythu Bharosa: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి వర్గ నిర్ణయాలను ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు.
రైతు భరోసా:
రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద ఏడాదికి రూ. 10వేలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రూ. 12వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. భూమి లేకపోవడం ఒక శాపం అయితే..ప్రభుత్వం కూడా ఆదుకోవడం లేదని పాదయాత్రలో తన ద్రుష్టికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ. 12వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Success Story: జ్యోతి...ఖండాంతరాల ఖ్యాతి.. అనాథాశ్రమంలో పెరిగి. .నేడు బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో
కొత్త రేషన్ కార్డులు:
ఇక చాలా ఏళ్ల నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉందని..అందుకే రేషన్ కార్డు లేని అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని సీఎం చెప్పారు. ఈ స్కీములన్నింటినీ జనవరి 26 నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి ఈ స్కీములన్నింటిని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు, రాళ్లు పర్పులు ఉన్నభూములు, మైనింగ్ కోసం ఇచ్చిన భూములు, రహదారి నిర్మాణంలో భాగంగా పోయినవి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినవి, పరిశ్రమలకు తీసుకున్నవి, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు:
ఇక వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అప్ డేట్ చేయలేదు. దాంతో కొంతమందికి గతంలో రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. దయచేసి ఎవరికివారే స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించాలని సీఎం విజ్నప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.