Warangal Medico Preethi's Death Case: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌కి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి బలైన మెడికో ప్రీతి మృతి కేసులో సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యాయత్నంతో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రీతి తొలుత ఎంజీఎంకి తరలించగా.. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే మూడ్నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ప్రీతి తుది శ్వాస విడిచిన విషయం విదితమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రీతి మృతి కేసులో అరెస్ట్ అయి కేసు విచారణ ఎదుర్కొంటున్న సైఫ్ ఇప్పటికే మూడుసార్లు బెయిల్ కోసం బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసినప్పటికీ.. మూడు పర్యాయాలు సైఫ్ బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ఇదిలావుండగా నాలుగో ప్రయత్నంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సంబంధిత విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు.


ప్రీతి మృతి కేసులో చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు కేసు విచారణ అధికారి ఎదుట ప్రతీ శుక్రవారం హాజరు కావాల్సిందిగా కోర్టు స్పష్టంచేసింది. ఈ కేసులో సైఫ్ అరెస్ట్ అయి 56 రోజులు కావస్తోంది. సైఫ్ కి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఖమ్మం జైలు నుంచి రేపు గురువారం సైఫ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Singareni Collieries Profits: వడ్డీల రూపంలోనే ప్రతీ ఏటా రూ 750 కోట్ల రాబడి ఉన్న సంస్థ


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు ఒక సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వం అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే, ప్రీతి మృతిని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం కోసం వాడుకుంటున్నాయని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఎవ్వరినీ వెనకేసుకురావడం లేదని.. ప్రీతి కేసులో నిందితులు ఎవ్వరైనా, ఎంతటి వారైనా వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Vizag Steel Plant EOI Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈఓఐ బిడ్డింగ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. సింగరేణి ముందుకొచ్చేనా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK