Sarpanch Kicks Local Person: సర్పంచ్.. ఊరి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుడు, ఊరి సమస్యలను పరిష్కరించి, ఊళ్లో జరిగే అన్ని కార్యాలకు పెద్దగా నిలబడాలి.. కానీ ఊరి సమస్యల గురించి ప్రశ్నించినందుకు నడి రోడ్డుపై గ్రామస్థుడిని బూటు కాలుతో తన్నటమేకాకుండా, విచక్షణ రహితంగా దాడి చేసాడు ఆ సర్పంచ్ (Sarpanch). 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన తెలంగాణ (Telangana) వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం (Marpally mandal) దామస్తపూర్‌లో చోటుచేసుకుంది.  సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిని... స్థానిక డ్రైనేజీ సమస్యల, నీటి సమస్యలను పరిష్కారించాలని దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ అడగ్గా.. ఆవేశానికి గురైన సర్పంచ్ జైపాల్‌ రెడ్డి అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సర్పంచ్ గాల్లో ఎగిరి శ్రీనివాస్ ను తన్నటమే కాకుండా, విచక్షణ రహితంగా దాడి చేయగా, శ్రీనివాస్‌ అక్కడే రోడ్డుపై పడిపోయాడు. 


Also Read: Prostitution Racket in a Tunnel: సొరంగంలో వ్యభిచారం... ఆలోచనే కొత్తగా ఉంది కాదా..!! పదండి పూర్తీ వివరాలు తెలుసుకుందాం!




ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. చుట్టూ ఉన్న ఇతర గ్రామస్తులు సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిని (Sarpanch Jaipal Reddy) శాంతింప చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై శీనివాస్ ను ప్రశ్నించగా... గ్రామంలో ఉన్నడ్రైనేజీ సమస్యల, నీటి సమస్యలను పరిష్కారించాలని ప్రశ్నించినందుకు సర్పంచ్‌ తనపై దాడి చేశారని ఆరోపించాడు. 


అధికార మదంతో సామాన్య ప్రజలపై రెచ్చిపోతున్న సర్పంచ్ జైపాల్‌ రెడ్డి పై కఠిన చర్యలను తీసుకోవాలని శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Also Read: Sai dharam tej: ''అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది''..ఆలోచింపజేసేలా 'రిపబ్లిక్' ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి