Prostitution Racket in a Tunnel: సొరంగంలో వ్యభిచారం... ఆలోచనే కొత్తగా ఉంది కాదా..!! పదండి పూర్తీ వివరాలు తెలుసుకుందాం!

సాధారణంగా సొరంగాలు రవాణా సులభతరం కోసం, దూరాన్ని తగ్గించటానికి తయారు చేస్తారు. సాధారణ ప్రజలు సొరంగాల జోలికి పోరు, మెట్రో ట్రెయిన్ వంటి వాటి కోసం ప్రభుత్వాలు సొరంగాలను తవ్వుతాయి.. కానీ కర్ణాటకలో వ్యభిచారం కోసం సొరంగం తవ్వారు.. ఆ కథేంటో చూద్దాం పదండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 03:20 PM IST
  • కర్ణాటక తుముకూరు సమీపంలో సొరంగ వ్యభిచారం
  • జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా కండోంలు
  • సొరంగం ద్వారా వ్యభిచారం చేస్తున్న నంది డీలక్స్‌ లాడ్జి
Prostitution Racket in a Tunnel: సొరంగంలో వ్యభిచారం... ఆలోచనే కొత్తగా ఉంది కాదా..!! పదండి పూర్తీ వివరాలు తెలుసుకుందాం!

Prostitution Racket in a Tunnel: సాధారణంగా సొరంగాలు ఎందుకు వాడతారు.. ?? మనకు తెలిసి, రవాణా సులభతరం కోసం, దురాన్ని తగ్గించటానికి వాడుతుంటాం, వీటిని ముఖ్యంగా ప్రభుత్వాలు మెట్రో రైళ్ళ నిర్మాణం, దూరాన్ని తగ్గించటానికి సొరంగాల ద్వారా రోడ్డు నిర్మాణాలు చేపడతాయి. 

కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో తుముకూరు (Tumkur) సమీపంలో ఒక లాడ్జ్ లో వ్యభిచారం నడపటానికి సొరంగాన్ని తవ్వారు. ఆలోచన కొత్తగా, నమ్మటానికి వీలు లేకుండా ఉన్న ఇది నిజం.. 

కుప్పలు కుప్పలుగా కండోంలు:

అది కర్ణాటక తుముకూరు జాతీయ రహదారి (Karnataka Tumkur National Highway ).... ఒక్కసారిగా రహదారిపై ఉన్నట్టు ఉండి కుప్పలు తెప్పలుగా.. గుట్టలు గుట్టలుగా కండోమ్స్‌ దర్శనం ఇచ్చాయి. అది కాస్త ఆ నోట ఈ నోట పడటంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది. మొదట ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

Also Read: Sai dharam tej: ''అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది''..ఆలోచింపజేసేలా 'రిపబ్లిక్' ట్రైలర్

ముందుగా విచారణ ప్రారంభంలో చుట్టూ ఎవైన వేశ్యల గృహాలు ఉన్నాయా అని చూసారు.. అలాంటి ఇళ్లేవి కనపడకగా పోగా... ఇంతలా కండోం కుప్పలు ఎక్కడి నుండి వచ్చాయని అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇక లాభం లేదని అక్కడికి ఎలా వచ్చాయో అన్న కోణంలో ప్రత్యేక నిఘా పెట్టారు కర్ణాటక పోలీసులు. 

బయటపడ్డ సొరంగ వ్యభిచారం: 

చుట్టూ పక్కల ఉన్న అన్ని హోటల్ లు లాడ్జ్ మరియు అపార్ట్ మెంట్స్ లలో తనిఖీ చేస్తూ వచ్చారు. ఇలా తనిఖీలో భాగంగా సమీపంలో ఉన్న నంది డీలక్స్‌ లాడ్జి (Nandi Deluxe Lodge) దగ్గర పోలీసులు ఆగిపోయారు. ఎప్పటిలానే  లాడ్జి లోపలి వెళ్లి, అన్ని రూమ్ లలో వెతికారు, వారికి ఏం కనపడకపోగా, యధావిధిగా లాడ్జి సిబ్బందిని ప్రశ్నించారు. 

Also Read: IPL 2021: వావ్..వాట్ ఏ మ్యాచ్..చివరి బంతి వరకు ఉత్కంఠ..ఆఖర్లో రాజస్థాన్ అద్బుత విజయం

సిబ్బంది సమాధానాలలో కొద్దిగా అనుమానం రావటంతో పోలీసులు ఖాకీ స్టైల్ లో విచారణ జరిపారు. అంతే ఇక అసలు గుట్టు బయటపడింది. లాడ్జ్ లో జరుగుతున్న సొరంగం వ్యభిచారం (Tunnel Prostitution) గురించి తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. రూమ్ లో సోరంగానికి టేబుల్ చెక్కలను అడ్డుపెట్టి వ్యభిచారం జరుపుతున్నారు. టేబుల్ ను తొలగించి సొరంగం డోర్ తెరవగానే, అందులో నుండి ఒక జంట పాక్కుంటూ భయటకి వచ్చింది. 

సొరంగం ద్వారా అమ్మాయిలను లోపలి పంపి పక్కా ప్రణాళికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న నంది డీలక్స్‌ లాడ్జి గుట్టు విని దేశమంత ఆశ్చర్యానికి లోనయింది. నిజానికి వారి చేసిన చిన్న తప్పే వారిని పట్టించింది. ఎన్నో ఏళ్ల నుండి గుట్టుగా సాగుతున్న వ్యభిచారం బయటపడటానికి కారణం వాడిన కండోంలను జాతీయ రహదారిపై పాడేయటమే... 

Also Read: ZEEL-Sony MEGA Merger Deal:జీల్- సోనీ విలీనం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు

అందుకే అంటారు.. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ క్రిమినల్ అయిన ఏదోక చిన్న తప్పు ద్వారా దొరికిపోతాడు అని.. కండోం లను అలా పడేయటం ద్వారా హైటెక్ రహస్య వ్యభిచారం గుట్టు బయటపడటంతో లాడ్జ్ యాజమాన్యం ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News