Secunderabad railway station new look: విమానాశ్రయపు సొగసులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
Secunderabad railway station new look: విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు తేడా మీకు తెలిసే ఉంటుంది. రైల్వేస్టేషన్లు కూడా విమానాశ్రయపు హంగులు సమకూర్చుకుంటే. ఆలోచన ఆద్బుతంగా ఉంది కదా. అదే జరగబోతోంది. ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్ఠేషన్ విమానాశ్రయంలా మారబోతోంది.
Secunderabad railway station new look: విమానాశ్రయాలకు, రైల్వేస్టేషన్లకు తేడా మీకు తెలిసే ఉంటుంది. రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయపు హంగులు సమకూర్చుకుంటే. ఆలోచన ఆద్బుతంగా ఉంది కదా. అదే జరగబోతోంది. ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్ఠేషన్ విమానాశ్రయంలా మారబోతోంది.
రైల్వే ఇప్పుడు మారుతోంది. భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే దారులు వెతుక్కుంటోంది. పాత విధానాల్ని మార్చే దిశగా అడుగులేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ (Privatisation) దిశగా పయనిస్తోంది. రైల్వే స్టేషన్లను విమానాశ్రకయాల్లా(Airports) తీర్చిదిద్దుతూ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. పెద్ద రైల్వే స్టేషన్లను ( Railway Stations) ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టి వాణిజ్యపరంగా ఆదాయం పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రైల్వే శాఖ. రైల్వేకు అనుబంధంగా ఏర్పాటైన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్ఎస్‌డీసీ ఆధ్వర్యాన కార్యాచరణ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) అభివృద్ధి కానుంది. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుంది.
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళిక
దాదాపు ఐదున్నర ఎకరాల స్థలంలో లక్ష చదరపు మీటర్ల మేర నిర్మాణం ఉంటుంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగదు. రైలు ప్రయాణీకుల సేవలు అలాగే ఉంటాయి. కానీ ఇతరత్రా ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. మెట్రో రైలుతో అనుసంధానం జరుగుతుంది. ఒకటి, పదవ నెంబర్ ప్లాట్‌ఫామ్‌లు మెట్రో రైలుతో ( Metro rail linking ) జత చేరనున్నాయి. సాధారణ రైలు దిగిన ప్రయాణీకులు నేరుగా ఎస్కలేటర్ ద్వారా పక్కనే ఉన్న మెట్రో రైలు స్టేషన్‌లోకి ఎంట్రీ ఉండేలా ఏర్పాటు చేస్తారు. మెట్రో రైలెక్కి కావల్సిన గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం రైళ్లు, రైల్వే స్టేషన్ల నిర్వహణ రైల్వే శాఖే (Indian railway) చూసుకుంటుంది. కాని భవిష్యత్‌లో ఈ భారాన్ని రైల్వే శాఖ వదిలించుకోనుంది. ప్రతిపాదిత రైల్వే స్టేషన్ల బాధ్యత అంతా ఐఆర్‌ఎస్‌డీసీ (IRSDC) నే చూసుకుంటుంది. వాణిజ్యపరంగా స్టేషన్ అభివృద్ధి చేసి భారీ ఆదాయం పొందనుంది. సికింద్రాబాద్ తరువాత నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం స్టేషన్లను తన ఆధీనంగా తీసుకోనుంది ఐఆర్ఎస్‌డీసీ.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రాతి కట్టడాన్ని అలాగే ఉంచి..దానిపై మూడు అంతస్థుల్లో భారీ కాంప్లెక్స్ నిర్మితం కానుంది. ప్లాట్‌ఫామ్ 1 ముందున్న ఖాళీ స్థలం, ప్లాట్‌ఫామ్ 10 వైపున్న ఖాళీ స్థలాల్ని కలుపుతూ మెగా కాంప్లెక్స్(Mega shopping complex) నిర్మిస్తారు. దీనికోసం పూర్తిగా విమానాశ్రయాల ప్రణాళికను అమలు చేయనున్నారు. అరైవల్, డిపార్చర్ కోసం వేర్వేరు సెక్షన్స్ ఉంటాయి. భవనానికి దిగువన 450 వాహనాలు నిలిపేలా భారీ పార్కింగ్‌తో సెల్లార్ ఉంటుంది. ప్రస్తుతం రైలు ట్రాక్‌పై పూర్తిగా ఖాళీగా ఉంది. కొత్త ప్రణాళికలో ఇదంతా భవనం లోపలకు చేరుతుంది. ట్రాక్‌పై భాగంలో కూడా నిర్మాణం ఉంటుంది. టికెట్ కౌంటర్లు సహా ప్రయాణీకులతో ముడిపడి ఉన్న ఇతర కార్యకలాపాల కోసం వేర్వేరు ప్రాంగణాలుంటాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. విమానాశ్రయంలో వెళ్లగానే లోపలుండే సెటప్ ఉంటుంది. పై అంతస్థుల్ని పూర్తిగా వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, గేమింగ్ జోన్, షాపింగ్ కాంప్లెక్స్ ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయి.
Also read: Golden Chariot Train tour: మహారాజభోగాలతో దక్షిణ బారతదేశ పర్యటన చేయాలనుందా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook