Three held for selling Drugs: నిషేధిత నార్కోటిక్ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 80 ఎంఎల్ హాష్ ఆయిల్, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. లాలాగూడ ఇన్‌స్పెక్టర్ మధులత ఈ వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాలాపేట్ జీహెచ్ఎంసీ మైదానం వద్ద హాష్ ఆయిల్ విక్రయించడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని ఇన్‌స్పెక్టర్ మధులత తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. లాలాపేట్‌కు చెందిన అఖిల్ (22), సాయి కిరణ్ (23), హేమంత్ (22) కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.


సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అఖిల్ గతంలోనూ నేరాలకు పాల్పడ్డాడని.. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తెలిపారు. మంగల్‌హట్ నుంచి నాలుగు హాష్ ఆయిల్ బాటిల్స్ కొనుగోలు చేసి వాటిని అధిక రేట్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఆశిష్, అతని స్నేహితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో బాటిల్ రూ.1500 చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిపారు. సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు..


కాగా, బుధవారం (మార్చి 9) వరంగల్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ.57 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకు మూడు రోజుల క్రితం ఇదే వరంగల్‌లో మరో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో ఇలా వరుసగా గంజాయి ముఠాలు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. 


Also Read: CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook