Senior Leader Komati Reddy Raja Gopal Reddy Meets Bandi Sanjay: తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రానుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీమానా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. కొన్ని క్షణాల్లో రాజీనామాను ఆమోదించారు. దీంతో మునుగోడు స్థానం ఖాళీ అయ్యింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలో హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మునుగోడుకు ఎన్నిక జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ జోరు మీద ఉంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలే టార్గెట్‌గా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి రాష్ట్ర బీజేపీ నేతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. 


ప్రస్తుతం మూడో దశ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. నేరుగా పాదయాత్ర శిబిరానికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారే రాజగోపాల్‌రెడ్డి ..కమలతీర్థం పుచ్చుకోనున్నారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు బీజేపీలో చేరనున్నారు.


ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్‌లో మార్పులు చేయాలని బండి సంజయ్‌ను కోరినట్లు తెలిపారు. తనపై గుత్తా సుఖేందర్‌రెడ్డి కామెంట్స్‌ చేసేటప్పుడు ఆయన ఎన్ని పార్టీలు మారారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారరని చెప్పారు. తన నిజాయితీ, నిబద్ధతను శంకించే స్థాయి గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేదన్నారు. ఈనెల 21న అమిత్ షా సభ ద్వారా బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు.


అదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కూడా బీజేపీ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు స్పష్టమైన సమాచారం అందుతోంది. పార్టీలోకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె ఆంగీకారం తెలిపారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 21న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.


Also read:Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు'గండం'..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!


Also read:Trump House: ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు..ఖండించిన అమెరికా మాజీ అధ్యక్షుడు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook