Panjagutta Police Revealed Kidnap Case Details: హైదరాబాద్ నగరంలో సంచలనం రేకిత్తించిన ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఛేదించిన పంజాగుట్ట పోలీసులు మీడియా ముందు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో కిడ్నాప్ అయిన వ్యక్తి బామ్మర్దే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. సినిమా తరహాలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ట్విస్టులు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏసీపీ మోహన్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమీర్‌పేట్‌కు చెందిన మురళీ కృష్ణ అనే వ్యక్తి ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. జనవరి 27న అమీర్‌పేట్‌ లాల్‌ బంగ్లా సమీపంలోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో తన పిల్లలను డ్రాప్ చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా..  ఇన్నోవా కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమని.. తమతో పాటు కారులో రావాలని చెప్పారు. మురళీకృష్ణ నిరాకరించడంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని బాటసింగారంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. 


అక్కడ మురిళీకృష్ణను కిందకుదించి 60 లక్షల రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో.. బావమరిది రాజేష్‌ను అరెస్ట్ చేశామని చెప్పి ఫోన్‌లో మాట్లాడించారు. ఈసారి నీ భార్యను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో మురళీ కృష్ణ భయపడిపోయాడు. తన భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అనంతరం రూ.30 లక్షలు రెడీ చేయించి తన బావమరిదితో ఇచ్చి పంపించమన్నాడు. అతను డబ్బులు తీసుకుని వచ్చి.. నాంపల్లి వద్ద నిందితులకు అప్పగించాడు. 


అక్కడి నుంచి డబ్బుల బ్యాగ్ తీసుకున్న నిందితులు.. మురళీకృష్ణను ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వదిలేసి పరార్ అయ్యారు. అనంతరం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈ నెల 4వ తేదీన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారించారు. మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేసి.. సీసీ కెమెరాలను పరిశీలించారు. 


చివరకు కేసులో మురళీకృష్ణ బామమరిది ప్రధాన నిందితుడు రాజేశ్‌ అని తేలింది. దీంతో బాధితుడితోపాటు పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మురళీకృష్ణకు సహకరించిన మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేశారు. మరోవ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ కోసం ఉపయోగించిన కారును.. రూ.15.45 లక్షల నగదు, బైక్, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 


Also Read: MLA Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి స్నేహితుడు  


Also Read: MLA Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి