Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులను షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్‌ పోలీసులు అందజేశారు. ఈఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజాసింగ్‌పై నోటీసులు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పాత కేసుల్లో తనను ఇరికించేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్ననే నోటీసులు సిద్ధం చేసి ఇవాళ ఇచ్చేందుకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసులు నమోదు అయి ఆరు నెలలు అయినా ఇప్పుడు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలకు గాను రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. అసిస్టెంట్ చీఫ్‌ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఈఏడాది ఫిబ్రవరి 19న మంగళ్‌హట్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 


శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా రెచ్చగొట్టేలా పాట పాడారని షాహినాయత్ గంజ్‌ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. ఎస్సై రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో తాజాగా రాజాసింగ్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై తెలంగాణవ్యాప్తంగా ఆరు చోట్ల ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. 


ఈక్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐతే 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టు వివరించారు. దీంతో పోలీసుల అరెస్ట్ విధానం సరిగా లేదని ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 


ఈనేపథ్యంలో పోలీసులు నోటీసులు అందజేశారు. మరోవైపు రాజాసింగ్‌ రిమాండ్‌పై హైకోర్టును పోలీసులు ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. 


Also read:Monkeypox: ఒకేసారి మూడు వైరస్‌లు సోకడం సాధ్యమేనా..శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!


Also read:CJI NV Ramana: హైదరాబాద్‌ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్..పచ్చజెండా ఊపిన సీజేఐ ఎన్వీ రమణ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి