సింగరేణిలో మరో ప్రమాదం... బొగ్గు పెళ్లలు కూలడంతో అండర్ మేనేజర్ మృతి...
Singareni Coal Mine Accident: సింగరేణిలో వరుస ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం శ్రీరాంపూర్ డివిజన్‌లో జరిగిన ప్రమాద ఘటన మరవకముందే మందమర్రి పరిధిలోని కల్యాణిఖని బొగ్గు గనిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
Singareni Coal Mine Accident: సింగరేణిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రిలోని కల్యాణిఖని ఓపెన్ కాస్ట్ మైన్‌లో (Open Cast Mining) బొగ్గు పెళ్లలు కూలి ఓ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. మృతుడి పేరు పురుషోత్తం అని, అండర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడని కల్యాణిఖని అధికారులు వెల్లడించారు. గనిలో ప్రమాదం జరిగిన స్థలాన్ని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్, ఇతర అధికారులు పరిశీలించారు.
గతవారం ఇదే మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్‌లో గని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో (Coal Mine) పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), నర్సింహరాజు (30) చంద్రశేఖర్ (29)గా గుర్తించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన సింగరేణి యాజమాన్యం (Singareni)... మృతుల కుటుంబాలకు దాదాపు రూ.70 లక్షలు నుంచి రూ.1కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.
Also Read : బంగార్రాజు'తో స్టెప్పులు వేయనున్న 'జాతిరత్నాలు' బ్యూటీ..
ఇటీవల శ్రీరాంపూర్ పరిధిలోని ఆర్కే 7 గనిలోనూ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నల్లూరి సంతోష్ అనే ట్రామర్ గాయపడ్డాడు. సింగరేణి బొగ్గు గనుల్లో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించడమే సింగరేణి (Singareni) లక్ష్యమని యాజమాన్యం చెబుతున్నప్పటికీ వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. యాజమాన్యం ఇకనైనా కార్మికుల రక్షణ పట్ల మరింత శ్రద్ధ వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook