గర్వంగా ఉందంటూ.. మంత్రి కేటీఆర్‌పై సమంత ప్రశంసలు! విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే
Samantha tweet about Telangana T-Hub inauguration. కేటీఆర్ చేసిన ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేసి.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
Samantha tweeting about Telangana T-Hub Inauguration: యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు 'టీ హబ్'. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక టీ హబ్. రెండో దశలో భాగంగా రాయదుర్గంలో టీ హబ్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాన్ని జూన్ 28న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం (జూన్ 26) ట్వీట్ చేశారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన టీ హబ్ భవనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
రాయదుర్గంలో టీ హబ్ భవనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. 'హైదరాబాద్ టీ హబ్ ప్రారంభంతో తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు పునరుజ్జీవం రానుంది. టెక్నాలజీ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి' అని పేర్కొన్నారు. 'భవిష్యత్తు ఊహించుకోవడం కంటే.. సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గం' అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన కొటేషన్‌ను కూడా జతచేశారు. ఈ ఫొటొస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై టాలీవుడ్ హీరోయిన్ సమంత స్పందించారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌పై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. 'యువత భవిష్యత్తు కోసం టీ హబ్ చాలా గొప్పది. యువ వ్యాపారాలకు సానుకూలత మరియు ఆశాజనక ఉద్యోగాలు సృష్టించబడతాయి. ప్రతి సంవత్సరం రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. సమంత, విజయ్ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని త్రిపుల్ ఐటీ ప్రాంగణంలో టీ హబ్ కార్యాలయం ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి 300లకు పైగా స్టార్టప్‌లకు ఇది నెలవైంది. టీ హబ్‌ను బిజినెస్ ఇంక్యుబేటర్‌గా నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తించింది. టీ హబ్ సిలికాన్ వ్యాలీని తలపిస్తోంది. ఇక్కడ వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి పరిజ్ఞానం ఇక్కడ ఉంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నల్సార్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఇది పని చేస్తోంది. దేశీయ దిగ్గజ సంస్థలు కూడా టీ హబ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. స్టార్టప్‌ల ఏర్పాటుకు నాస్కామ్ సంస్థతో కలిసి పని చేస్తోంది.
Also Read: Hardik Pandya Record: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
Also Read: Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి