Hardik Pandya Record: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

Hardik Pandya becomes first Indian captain to take a wicket. తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా అరుదైన ఘనత అందుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 27, 2022, 12:09 PM IST
  • ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం
  • చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా
  • తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు
Hardik Pandya Record: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

Hardik Pandya becomes first Indian captain to take a wicket in T20 Cricket: ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ దీపక్‌ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు హ్యారీ టెక్టార్‌ (64 నాటౌట్‌; 33 బంతుల్లో 64, 36) హాఫ్ సెంచరీ బాది ఐర్లాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. 

తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వికెట్‌ పడగొట్టిన తొలి భారత కెప్టెన్‌గా హార్ధిక్‌ రికార్డు నెలకొల్పాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా రెండో ఓవర్‌ వేసిన హార్దిక్.. పాల్‌ స్టిర్లింగ్‌ (4)ను ఔట్ చేశాడు. దాంతో ఈ ఘనతను హార్దిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో ఉండడంతో హార్దిక్‌ పాండ్యా తొలిసారి భారత కెప్టెన్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. 

రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఆరంభం కావాల్సింది. టాస్‌ పడ్డ కాసేపటికే వరుణుడి పలకరించాడు. దాంతో ఆట సమయానికి సాధ్యం కాలేదు. కాసేపటికి వర్షం ఆగి ఆట ఆరంభమయ్యేలా కనిపించినా.. మరోసారి వరుణుడు వచ్చాడు. చివరికి నిర్ణీత సమయం కంటే 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. దాంతో అంపైర్లు మ్యాచును 12 ఓవర్లకు కుదించారు. ఐర్లాండ్‌ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయాగా.. భారత్ మరో 16 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 

Also Read: AP Schools Reopening: 2022-23 అకడమిక్‌ కేలండర్‌ విడుదల.. జులై 5 నుంచి పాఠశాలలు ఆరంభం!  

Also Read: Amma Vodi: తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి డబ్బులు.. శ్రీకాకుళంలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News