Software Engineer Prashant: నాలుగేళ్లు పాక్ చెరలో, ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్
Prasanth Safely Reached Hyderabad : పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన ప్రశాంత్ గుర్తున్నాడా, అదేనండీ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నాడు. తల్లిదండ్రులను కలుసుకుని హర్షం వ్యక్తం చేశాడు.
Prasanth Safely Reached Hyderabad | గతంలో తన ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తూ పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన ప్రశాంత్ గుర్తున్నాడా, అదేనండీ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నాడు. తల్లిదండ్రులను కలుసుకుని హర్షం వ్యక్తం చేశాడు. స్విట్జర్లాండ్‌లో ఉన్న ప్రేయసిని కలుసుకునేందుకు రోడ్డుమార్గాన్ని ఎంచుకోవడంపై గతంలోనే కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ప్రశాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. అయితే 2017లో ఏప్రిల్ నెలలో కుటుంబసభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా తన ప్రియురాలి కోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు ప్రశాంత్. ఇక్కడి నుంచి రైలులో ప్రయాణించి రాజస్థాన్‌కు చేరుకున్నాడు. సరిహద్దులో ఉన్న కంచె దాటి పాకిస్తాన్‌లో కాలుపెట్టిన ప్రశాంత్‌ను పాక్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను విచారించిన అధికారులు హైదరాబాద్ (Hyderabad) నుంచి అక్కడికి వచ్చాడని, కానీ అతడి వద్ద ఎలాంటి పాస్‌పోర్ట్, వీసా కూడా లేదని గుర్తించారు.
Also Read: SV Prasad Passes Away: కరోనాతో మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి, CM KCR సంతాపం
తన గురించి భయపడవద్దని, పాక్ అధికారులు తనను ఏం అనలేదంటూ ఓ వీడియో విడుదల చేశాడు. అదే సమయంలో ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి విషయం చెప్పారు. మరోవైపు తెలంగాణ (Telangana Govt) ప్రభుత్వం సైతం చొరవ చూపి విదేశాంగశాఖను సహాయం కోరింది. గత నాలుగేళ్లుగా పలుమార్లు చర్చ జరగగా, నిన్న పాక్ చెర నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. మాదాపూర్ పోలీసులు నేడు హైదరాబాద్ తీసుకొచ్చారు.
Also Read: Bank Timings In Telangana: లాక్‌డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook