Bank Timings In Telangana: లాక్‌డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే

Bank Timings In Telangana: తొలుత హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసు నడిచేవేళలలో మార్పులు చేశారు. ఈ క్రమంలో సోమవారం నాడు తెలంగాణలో బ్యాంకుల ప‌నివేళలు కూడా మార్చేశారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 1, 2021, 11:09 PM IST
  • తెలంగాణలో జూన్ 9 వరకు మరో 10 రోజులపాటు పొడిగించిన లాక్‌డౌన్
  • లాక్‌డౌన్ పొడిగింపుతో రాష్ట్రంలో మారిన బ్యాంకుల పనివేళలు
  • నేటి నుంచి తెలంగాణలో బ్యాంకు టైమింగ్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు
Bank Timings In Telangana: లాక్‌డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే

Bank Timings In Telangana: హైద‌రాబాద్‌: తెలంగాణలో తాజాగా చేసిన లాక్‌డౌన్‌ స‌డ‌లింపుల నేప‌థ్యంలో రాష్ట్రంలో పలు సర్వీసుల పని వేళలు మారాయి. తొలుత హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసు నడిచేవేళలలో మార్పులు చేశారు. ఈ క్రమంలో సోమవారం నాడు తెలంగాణలో బ్యాంకుల ప‌నివేళలు కూడా మార్చేశారు. 

తెలంగాణలో పొడిగించిన లాక్‌డౌన్ జూన్ 9 వరకు అమలులో ఉండనుందని తెలిసిందే. నేటి (జూన్ 1వ తేదీ) నుంచి రాష్ట్రంలో బ్యాంకులు ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సేవలు (Banks Working Hours In Telangana) అందించనున్నాయి. నిన్నటివరకు ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి. అయితే లాక్‌డౌన్ పొడిగింపు (Telangana Lockdown)లో భాగంగా 6 గంటల నుంచి 10 గంటలవరకు ఉన్న మినహాయింపులను, మధ్యాహ్నం 1 వరకు సవరించారు. ఈ క్రమంలో బ్యాంకులు పనివేళల్ని ఖాతాదారులకు, సిబ్బందికి ఏ ఇబ్బంది లేకుండా చూసేందుకుగానూ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సేవలు అందించేలా పనివేళల్లో మార్పులు చేశారు.

కాగా, జూన్ 9 వరకు మెట్రో రైలు (Hyderabad Metro) తొలి సర్వీసు ఉదయం 7 గంటలకు మొదలుకాగా, చివరి మెట్రోరైలు సర్వీసు ఉదయం 11:45 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. చివరి రైలు సర్వీసు 12:45 చివరి స్టేషన్‌కు చేరుకుని సేవలు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌ను ట్విట్టర్ ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో రైలు వెల్లడించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News