సోనియా సాక్షిగా కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కోదండరాం
మేడ్చల్ బహిరంగ సభలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కొడంరాం ఉద్దేగంగా ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫాం హౌస్ లో నిద్రపోయే కేసీఆర్ కు ఓటు వేస్తే వృధా అవుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లుకు మాత్రమే లాభం కలిగింది..ప్రజలకు దక్కింది శూన్యం విమర్శించారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయలేదు..లక్ష ఉద్యోగాలు కాదు కదా..25 వేలుఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తామని హమీ ఇచ్చి మోసం చేశారు. రుణమాఫీ మాటలకే పరిమితమైంది.. ఆచరణలో సాధ్యం కాలేదని ఆరోపించారు. ఇటు తెలంగాణ విద్యర్ధులకు ఫీజురీయింబర్స్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతుంది. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు దళితుల దాడి చేశారు. మొత్తంగా చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. నాలుగేళ్ల పాలన నిరంకుశ పాలన తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అందుకే టీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని శక్తులు ఏకమయ్యాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖామమని కోదండరాం పేర్కొన్నారు. మహాకూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అలాగే తెలంగాణ ఇచ్చి సోనియా ఎంతగా త్యాగం చేశారో అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు.. సోనియాలాంటి గొప్ప నేత పాల్గొన్న సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని కోదండరాం పేర్కొన్నారు.