తెలంగాణలో మారుతున్న రాజకీయం.. బీజేపీ వైపు చూస్తున్న టీఆర్ఎస్ అసంతృప్త నేతలు..?
TRS dissent Leaders future plan: తెలంగాణలో పాలిటిక్స్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన పలువురు సీనియర్ నేతలు.. ఇటీవల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
TRS dissent Leaders future plan: తెలంగాణలో పాలిటిక్స్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన పలువురు సీనియర్ నేతలు.. ఇటీవల భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పోంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఈ నేతలు జంపింగ్ ఆలోచనలో ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఖమ్మం జిల్లా పాలేరులో ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మల ఇండిపెండెంట్‌గా లేదా ఏ పార్టీ నుంచైనా అభ్యర్థిగా బరిలో నిలిస్తే ఆయన వెంటే తమ పయనమని ఆ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకొని పోవటం లేదంటూ వాపోయారు. పాలేరులో జరిగిన ఈ సమావేశానికి తుమ్మల హాజరుకానప్పటికీ.. ఈ సమావేశంతో తుమ్మల పార్టీ మార్పుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.
తుమ్మల, జూపల్లి, పొంగులేటి.. ఈ ముగ్గురు నేతల్లో ఎవరిపై ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గ్రాండ్ వికర్టీ సాధించడంతో.. గులాబీ గూటిలో ఉన్న అసంతృప్తి నేతలు కాషాయ దళం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
తుమ్మల వెంటే తాము ఉంటామంటూ ఆయన వర్గీయులు తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? లేక పార్టీ మారాలంటూ తుమ్మలపై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారా.. అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పరోక్షంగా తెలంగాణపై ప్రభావం చూపించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌లపై చీటింగ్ కేసు..
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో అవకతవకలు.. ఆర్బీఐ బ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook