Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​లో అవకతవకలు.. ఆర్​బీఐ తాత్కాలిక నిషేధం!

Paytm Payments Bank: చిన్న తరహా బ్యాంకింగ్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​పై ఆర్​బీఐ తాత్కాలిక నిషేధం విధించింది. సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 06:53 PM IST
  • పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ చర్యలు
  • ఆర్థిక అవకతవకలే కారణం!
  • కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశం
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​లో అవకతవకలు.. ఆర్​బీఐ తాత్కాలిక నిషేధం!

Paytm Payments Bank: ప్రముఖ పేమెంట్స్​ బ్యాంక్ సేవల సంస్థ.. పేటీఎం పేమెంట్​ బ్యాంక్​కు షాకిచ్చింది ఆర్​బీఐ. పేమెంట్​ బ్యాంక్​లోకి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని సూచించింది.

దీనితో పాటు.. పేటీఎం పేమెంట్​ బ్యాంక్ వెంటనే.. ఐటీ ఆడిట్ సంస్థను ఆపాయింట్​ చేసుకుని సమగ్ర ఆడిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ఆర్​బీఐ విడదల చేసిన ప్రెస్​ రిలీజ్​లో ఈ విషయాన్ని పేర్కొంది.

'పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ లిమిటెడ్ (పీబీబీఎల్​)ను తక్షణమే కొత్త కస్టమర్లకు చేర్చుకోవడంపై నిషేధం విధించాం. పరిశోధనలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తెలిసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం ఇన్​కం ట్యాక్స్​ ఆడిట్​ చేయాలని కూడా పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ను ఆదేశించా'మని ఆర్​బీఐ నిర్ణయించింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్​ 35ఏ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది ఆర్​బీఐ. అయితే పీపీబీఎల్​లో జరిగిన అవకతవకలు ఏమిటి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Also read: Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్ డేస్ సేల్​ షురూ.. డీల్స్ ఇవే..

Also read: Pepaid Recharge Plans: ఎయిర్​టెల్, వి, జియోల్లో.. రూ.200 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News