SSC Students Preparation: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలతో హరీశ్ రావు బంధం విడదీయరానిది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకున్నా కూడా గెలిచేంతా అభిమానం హరీశ్‌రావుకు ఉంది. అంత అభిమానం సొంతం చేసుకోవడానికి హరీశ్‌ రావు వ్యవహార శైలే కారణం. మరో చర్యతో హరీశ్‌ రావు ప్రజల మనసులు గెలుచుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు వస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ హరీశ్‌ రావు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దిపేటలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఉత్తరాలు రాశారు. విద్య విలువ చెబుతూ సమయం వృథా చేసుకోవద్దని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. పరీక్షలో మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు హరీశ్ రావు సూచనలు చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా హరీశ్‌ రావు కొన్ని మాటలు చెప్పారు. పిల్లలు చదువుకునేలా ఇంట్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పిల్లలకు మంచి చదువు చెప్పించి వారికి బంగారు భవిష్యత్‌ కల్పించాలని ఆకాంక్షించారు. హరీశ్ రావు లేఖలో సారాంశం ఇలా ఉంది.


'ప్రస్తుతం మీ పిల్లలు కూడా పదో తరగతి చదవుతున్నారు. వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ.. పాఠశాలల్లో బోధన పూర్తయింది. ఉపాధ్యాయులు పాఠాలన్ని మళ్లీ రివిజన్ కూడా చేస్తున్నారు. సాయంత్రం సమయంలో.. నేను కూడా అల్పహారం అందించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. నావంతు ప్రయత్నం నేను చేస్తున్నా. తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. ఈ రెండు నెలల పాటు విందులు, వినోదాలు, ఫంక్షన్లకు తీసుకెళ్లొద్దు. ఇంటి వద్దె ఉంచి.. ఇబ్బంది కలగించకుండా చదువుకునేలా సహకరించండి. కష్టంగా కాకుండా.. ఇష్టంగా చదివించండి. మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి" అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు హరీశ్ రావు లేఖలు రాశారు.

Also Read: AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter